తాత అయిన అనిల్ కపూర్.. పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చిన సోనమ్ కపూర్
- 2018లో ఆనంద్ అహుజాను పెళ్లాడిన సోనమ్ కపూర్
- రెండేళ్ల డేటింగ్ అనంతరం పెద్దల అంగీకారంతో పెళ్లి
- బిడ్డ రాకతో తమ జీవితాలు ఎంతో మారుతాయన్న సోనమ్
ఢిల్లీకి చెందిన ఆనంద్ అహూజాతో రెండేళ్ల పాటు డేటింగ్ చేసిన తర్వాత 2018లో ఆయనను సోనమ్ పెళ్లి చేసుకుంది. వీరి వివాహానికి బాలీవుడ్ స్టార్లు తరలివచ్చారు. లండన్ లో ఓ సినిమా ప్రమోషన్ సందర్భంగా సోనమ్ కు ఆనంద్ పరిచయమయ్యాడు. ఈ పరిచయం కాస్తా ప్రేమకు దారితీసింది. ఆ తర్వాత పెద్దల అంగీకారంతో వీరు పెళ్లి చేసుకున్నారు.