మునుగోడులో నీకు మూడు చెరువుల నీళ్లు తాగించడం పక్కా కేసీఆర్: కొండా సురేఖ
- ఉద్యమంలో నల్లగొండ వాసులది నలిగిన చరిత్ర అన్న సురేఖ
- ఉద్యమకారులను నలిపేసిన చరిత్ర కేసీఆర్దంటూ విమర్శ
- మునుగోడులో కేసీఆర్ ప్రసంగం మొదలు కాగానే ట్వీట్ చేసిన కాంగ్రెస్ నేత
'తెలంగాణ ఉద్యమాల్లో ఉస్మానియా యూనివర్సిటీలో నల్లగొండ జిల్లా వాసులది నాడు నలిగిపోయిన చరిత్ర .. అధికారం వచ్చాక ఉద్యమకారులను నలిపేసిన చరిత్ర నీది' అంటూ కేసీఆర్పై ఆమె విరుచుకుపడ్డారు. 'ఆనాడు నీ విషపు కోరల్లో బందీ అయినారు... కానీ నేడు మునుగోడు లో నీకు మూడు చెరువుల నీళ్లు తాగించడం పక్కా కేసీఆర్' అంటూ హెచ్చరించారు.