నిత్యానందకు నాన్ బెయిలబుల్ వారెంట్
- అత్యాచారం కేసు విచారణలో కోర్టుకు హాజరుకాని నిత్యానంద
- దేశం విడిచి వెళ్లడంపై పెద్ద ఎత్తున ప్రచారం
- కైలాస అనే దేశాన్ని ఏర్పాటు చేసుకున్నాడని వార్తలు
మరోవైపు, నిత్యానంద 'కైలాస' అనే స్వతంత్ర దేశాన్ని ఏర్పాటు చేసినట్టు గతకొంత కాలంగా వార్తలు వస్తున్నాయి. అయితే, ఈ కైలాస దేశం ఎక్కడుందనే విషయంలో గందరగోళం నెలకొంది. ఈక్వెడార్ సమీపంలో ఒక చిన్న ద్వీపాన్ని కొనుగోలు చేసి దానికి కైలాస అనే పేరు పెట్టారనే వార్తలు వచ్చాయి. అయితే ఈ వార్తలను ఈక్వెడార్ ఖండించింది. మరోవైపు నిత్యానంద చనిపోయాడనే వార్తలు కూడా వచ్చాయి. అయితే, తాను బతికే ఉన్నానని, వైద్య చికిత్స పొందుతున్నానని నిత్యానంద వెల్లడించాడు.