అమితాబ్ ని కలిసిన చందూ మొండేటి
- ఘన విజయం సాధించిన 'కార్తికేయ 2'
- ఉత్తరాదిన వెయ్యికి పైగా స్క్రీన్లలో ప్రదర్శితం
- అమితాబ్ బ్లెస్సింగ్స్ ఎప్పటికీ ఉంటాయన్న చందు మొండేటి
మరోవైపు, ఈ చిత్ర దర్శకుడు చందు మొండేటి బాలీవుడ్ లెజెండ్ అమితాబ్ బచ్చన్ ని కలిశారు. ఆయనను కలిసిన పిక్ ను సోషల్ మీడియా ద్వారా ఫ్యాన్స్ తో పంచుకున్నారు. ఈ సందర్భంగా ట్విట్టర్ ద్వారా చందు మొండేటి స్పందిస్తూ... అమితాబ్ గారు ఇచ్చిన బ్లెస్సింగ్స్ ఎప్పటికీ గుర్తుంటాయని అన్నారు. బిగ్ బీకి ధన్యవాదాలు తెలిపారు. ఈ చిత్రంలో బాలీవుడ్ సీనియర్ నటుడు అనుపమ్ ఖేర్ కూడా నటించిన సంగతి తెలిసిందే. మరోవైపు 'కార్తికేయ 3' కూడా రాబోతోందనే విషయంపై చిత్ర దర్శకుడు ఇప్పటికే క్లారిటీ ఇచ్చారు.