బాలీవుడ్ కి వెళుతున్న 'బింబిసార'
- ఈ నెల 5న థియేటర్స్ కి వచ్చిన 'బింబిసార'
- తొలిరోజునే దక్కిన హిట్ టాక్
- భారీ లాభాలను తెచ్చిపెట్టిన సినిమా
- హిందీ వెర్షన్ ను రెడీ చేస్తున్న టీమ్
ఈ సినిమాను తెలుగులో మాత్రమే విడుదల చేశారు. తెలుగులో తాము ఆశించే స్థాయిలో రెస్పాన్స్ వస్తే, అప్పుడు మిగతా భాషల్లో రిలీజ్ చేసే ఆలోచన ఉందని ప్రమోషన్స్ సమయంలో కల్యాణ్ రామ్ చెప్పాడు. ఆయన అనుకున్నట్టుగానే ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లో భారీ లాభాలను సొంతం చేసుకుంది.
దాంతో ఆయన ఇతర భాషల్లోను ఈ సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్టు సమాచారం. హిందీలో 'కార్తికేయ 2' భారీ వసూళ్లను రాబడుతూ ఉండటంతో , 'బింబిసార'ను కూడా ముందుగా హిందీలో రిలీజ్ చేసే ఆలోచనలో ఆయన ఉన్నాడని అంటున్నారు. అందుకు సంబంధించిన ప్రయత్నాలు ఆల్రెడీ మొదలయ్యాయని చెబుతున్నారు.