ఆ ఇద్దరు హీరోల వల్లనే దుల్కర్ కి హిట్ వెళ్లిందట!

Sita Ramam Movie Update
  • ఇటీవలే విడుదలైన 'సీతా రామం'
  • విడుదలైన ప్రతి ప్రాంతంలో భారీ వసూళ్లు 
  • ముందుగా ఈ కథ నాని దగ్గరికి వెళ్లిందంటూ టాక్ 
  • రామ్ కూడా వదులుకున్న ప్రాజెక్టు అంటూ ప్రచారం 
తెలుగులో హీరోగా ఒక సినిమా చేయాలని ఉందంటూ దుల్కర్ చాలా సందర్భాల్లో చెప్పాడు. అనుకున్నట్టుగానే ' సీతా రామం' సినిమాలో హీరోగా చేశాడు. హను రాఘవపూడి దర్శకత్వం వహించిన ఈ సినిమా, తెలుగు రాష్ట్రాల్లో  కంటే ఎక్కువగా ఓవర్సీస్ ప్రేక్షకులను అలరించింది. చాలా ప్రాంతాల్లో సక్సెస్ ఫుల్ గా రన్ అవుతోంది. 

ఈ మధ్య కాలంలో దుల్కర్ కి దక్కిన పెద్ద హిట్ గా ఈ సినిమాను గురించి చెబుతున్నారు. తెలుగులో ముందుగా ఈ సినిమా కోసం నానీని అడిగారట. అయితే వేరే ప్రాజెక్టులు లైన్లో ఉండటం వలన నాని ఈ ప్రాజెక్టు చేయలేనని చెప్పాడట. ఆ తరువాత ఈ కథ రామ్ కి వెళ్లిందినీ, అయితే, మాస్ కథలపై మనసుపడిన రామ్ ఈ కథ పట్ల అంతగా ఆసక్తిని చూపించలేదని అంటున్నారు. 

 ఇక ఎవరైతే బాగుంటారా అని మేకర్స్ ఆలోచన చేసి, దుల్కర్ ను అడిగి చూద్దామని చెప్పేసి ఆయనను సంప్రదించారట. కథ నచ్చడంతో దుల్కర్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం .. ఈ ప్రాజెక్టు పట్టాలెక్కడం జరిగిపోయాయని చెబుతున్నారు. నాని .. రామ్ చేయలేమని చెప్పిన కథ, దుల్కర్ కి హిట్ ఇచ్చిందనే టాక్ ఇప్పుడు బలంగా వినిపిస్తోంది.
Go Back to Shorts
Dulquer Salmaan
Nani
Ram
Sita Ramam Movie

More Telugu News