ఇంటి గోడపై మూత్రం పోశాడని.. వెంటపడి మరీ పొడిచి చంపేశారు!
- దేశ రాజధాని ఢిల్లీలో నడిరోడ్డుపై ఘటన
- తమ ఇంటి గోడ వద్ద మూత్రం పోసినందుకు యువకుడిని తిట్టిన ఓ మహిళ
- అంత పెద్ద తప్పేం చేశానంటూ వాదనకు దిగిన యువకుడు
- ఇది చూసి ఆగ్రహంతో యువకుడిని వెంటాడి కత్తితో పొడిచిన మహిళ కుమారుడు
దీనితో ఆగ్రహించిన మనీష్ వెంటనే తన స్నేహితులు ముగ్గురికి ఫోన్ చేసి పిలిపించాడు. నలుగురూ కలిసి మయాంక్ వెంట పడ్డారు. ఢిల్లీలోని మాలవీయ నగర్ ప్రాంతంలోని డీడీఏ మార్కెట్ సమీపంలో మయాంక్ ను పట్టుకున్నారు. నడి రోడ్డుపై అందరూ చూస్తుండగానే కత్తులతో పొడిచేసి పారిపోయారు. మయాంక్ ను ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ కాసేపటికే చనిపోయాడు. ఈ దృశ్యాలన్నీ సీసీ కెమెరాల్లో నిక్షిప్తమయ్యాయి. ఘటన వివరాలను ఢిల్లీ పోలీసులు వెల్లడించారు. మనీష్ తోపాటు అతడి స్నేహితులు రాహుల్, ఆశిష్, సూరజ్ లను అరెస్టు చేసినట్టు ప్రకటించారు.