తెలంగాణలో మరో 476 మందికి కరోనా పాజిటివ్
- గత 24 గంటల్లో 30,205 కరోనా పరీక్షలు
- హైదరాబాదులో 239 కొత్త కేసులు
- కరోనా నుంచి కోలుకున్న 984 మంది
- ఇంకా 3,763 మందికి చికిత్స
అదే సమయంలో 984 మంది కరోనా నుంచి కోలుకున్నారు. కొత్తగా ఎలాంటి మరణాలు సంభవించలేదు. తెలంగాణలో ఇప్పటివరకు 8,28,471 పాజిటివ్ కేసులు నమోదు కాగా... 8,20,597 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 3,763 మంది చికిత్స పొందుతున్నారు. రాష్ట్రంలో కరోనాతో ఇప్పటిదాకా 4,111 మంది మృతి చెందారు.
