smoking: 'నేను సిగరెట్ కాల్చింది డమ్మీ విమానంలో..' అంటున్న బాబీ కటారియా

Smoked In Dummy Plane says Influencer After Airline Shared Flight Number
షార్ట్స్‌లో చూడండి
స్పైస్‌జెట్ విమానంలో సిగరెట్ తాగి పోలీసు కేసును ఎదుర్కొంటున్న సోషల్ మీడియా ఇన్‌ఫ్ల్యూయెన్సర్ బాబీ కటారియా ఈ ఘటనపై వివరణ ఇచ్చాడు. తాను సిగరెట్ తాగింది నిజమైన విమానంలో కాదని.. అది డమ్మీ విమానంలో అని అన్నాడు. దుబాయ్ లో ఓ షూటింగ్ లో భాగంగా చేసిందన్నాడు. 

అయితే, జరిగిన ఘటనపై స్పైస్ జెట్ ఎయిర్ లైన్స్ ఇచ్చిన వివరణకు బాబీ కటారియా వాదన పూర్తి విరుద్దంగా ఉంది. ఈ ఘటన జనవరిలో తమ విమానంలో జరిగిందని స్పైస్ జెట్ ధ్రువీకరించింది. ఈ విషయాన్ని క్షుణ్ణంగా విచారించామని, గుర్గావ్ పోలీసులకు ఫిర్యాదు చేశామని చెప్పారు.

‘ఈ వీడియో జనవరి 20, 2022 న దుబాయ్ నుంచి ఢిల్లీకి వెళ్లాల్సిన ఎస్జీ 706 విమానంలో ప్రయాణికులు ఎక్కుతుండగా చిత్రీకరించారు. క్యాబిన్ సిబ్బంది ఆన్-బోర్డింగ్ ప్రక్రియను పూర్తి చేయడంలో నిమగ్నమై ఉన్నప్పుడు 21వ వరుసలో ఉన్న సదరు ప్రయాణికుడు, అతని సహ-ప్రయాణికులు ఈ వీడియోను చిత్రీకరించారు. దీని గురించి ఇతర ప్రయాణికులు, సిబ్బంది ఎవరికీ తెలియదు. సోషల్ మీడియా ద్వారా జనవరి 24న ఈ విషయం మా దృష్టికి వచ్చింది’ అని స్పైస్ జెట్ పేర్కొంది. 

ఫిబ్రవరిలోనే అతడిని 15 రోజుల పాటు నో -ఫ్లైయింగ్ లిస్ట్‌లో ఉంచినట్లు ఎయిర్‌ లైన్స్ తెలిపింది. కాగా, ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో కేంద్ర విమానయాన మంత్రి జ్యోతిరాదిత్య సింధియా స్పందించారు. అటువంటి ప్రమాదకర ప్రవర్తనను సహించేది లేదని మంత్రి చెప్పారు.
Go Back to Shorts
smoking
Airline
plane
spicejet

More Telugu News