మోదీకి రాఖీ కట్టిన స్వీపర్లు, ప్యూన్లు, డ్రైవర్ల కూతుళ్లు
- తన సిబ్బంది పిల్లలకు అరుదైన అవకాశం కల్పించిన ప్రధాని
- చిన్నారులతో జరుపుకున్న ఈ పండుగ ప్రత్యేకం అన్న మోదీ
- దేశ ప్రజలకు రక్షాబంధన్ శుభాకాంక్షలు చెప్పిన ప్రధాని
రాఖీ కట్టిన చిన్నారులతో మోదీ ఆప్యాయంగా మాట్లాడారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను మోదీ తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేశారు. చిన్నారులతో జరుపుకున్న ఈ రక్షా బంధన్ చాలా ప్రత్యేకమైనదని అన్నారు. అంతకుముందు రక్షా బంధన్ సందర్భంగా ప్రధాని మోదీ దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు.