మునుగోడు ఉప ఎన్నిక ఎప్పుడొచ్చినా విజయం మాదే: కవిత
- కోమటిరెడ్డి రాజీనామాతో మునుగోడులో ఉప ఎన్నిక
- మునుగోడులో టీఆర్ఎస్ ఎమ్మెల్యే లేకపోయినా అభివృద్ధి ఆగలేదన్న కవిత
- బీజేపీవి బ్యాక్ డోర్ పాలిటిక్స్ అని విమర్శ
బీజేపీ బ్యాక్ డోర్ పాలిటిక్స్ చేస్తుందని కవిత విమర్శించారు. బీహార్ లో జరుగుతున్న రాజకీయాలను అందరూ గమనిస్తున్నారని చెప్పారు. దేశ స్వాతంత్ర్య దినోత్సవ వజ్రోత్సవాల నేపథ్యంలో హైదరాబాద్ దోమలగూడలోని భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ మోడల్ హైస్కూల్ లో వన మహోత్సవ సంబరాలు జరిగాయి. ఈ కార్యక్రమంలో కవిత మాట్లాడుతూ పై వ్యాఖ్యలు చేశారు.