ఎప్పట్లాగానే ప్రధాని మోదీకి రాఖీ పంపిన పాక్ మహిళ
- పెళ్లయిన తర్వాత గుజరాత్ లో స్థిరపడిన పాక్ మహిళ
- 20 ఏళ్లకు పైగా మోదీకి రాఖీ కడుతున్న వైనం
- ఈసారి మోదీ తనను పిలుస్తారని ఆశాభావం
- వచ్చే ఎన్నికల్లో మోదీ గెలవాలని ఆకాంక్ష
ఈసారి ఆమె స్వయంగా రూపొందించిన రాఖీని పంపించడం విశేషం. రేష్మీ రిబ్బన్ పై ఎంబ్రాయిడరీ వర్క్ చేసిన ఆ రాఖీతో పాటు ఖమర్ ఓ లేఖను కూడా మోదీకి పంపారు. తనను ఈసారి మోదీ ఢిల్లీకి ఆహ్వానిస్తారని భావిస్తున్నట్టు ఖమర్ పేర్కొన్నారు. కాగా, వచ్చే పార్లమెంటు ఎన్నికల్లోనూ మోదీ విజయం సాధించాలని ఆకాంక్షిస్తున్నట్టు తెలిపారు.