చంద్రబాబుతో మోదీ ఏకాంత భేటీ... 5 నిమిషాలు మాట్లాడుకున్న నేతలు
- రాష్ట్రపతి భవన్లో ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ జాతీయ కమిటీ భేటీ
- కేంద్రం ఆహ్వానం మేరకు హాజరైన చంద్రబాబు
- భేటీ అనంతరం చంద్రబాబుతో మోదీ ఏకాంత భేటీ
దేశానికి స్వాతంత్య్రం సిద్ధించి 75 ఏళ్లు పూర్తి అవుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ పేరిట భారీ కార్యక్రమానికి తెరదీసిన సంగతి తెలిసిందే. ఈ ఉత్సవాలపై శనివారం రాష్ట్రపతి భవన్ వేదికగా నిర్వహించిన జాతీయ కమిటీ భేటీకి చంద్రబాబుకు కూడా ఆహ్వానం అందింది.
కేంద్రం ఆహ్వానాన్ని మన్నించిన చంద్రబాబు శనివారం ఉదయం ఢిల్లీ వెళ్లారు. రాష్ట్రపతి భవన్లో సాయంత్రం జరిగిన ఈ భేటీలో చాలా కాలం తర్వాత మోదీ, చంద్రబాబులు ఒకే వేదికపై కనిపించారు. భేటీ ముగిశాక అందరూ వెళుతున్న సమయంలో చంద్రబాబుతో మోదీ ఏకాంతంగా భేటీ అయ్యారు.