ప్రియుడిని పెళ్లాడబోతున్న హృతిక్ రోషన్ మాజీ భార్య?

Sussane khan to marry her boy friend
  • 14 ఏళ్ల వైవాహిక జీవితం తర్వాత బ్రేకప్ అయిన హృతిక్, సుసానే
  • అర్స్లాన్ గోనీతో రిలేషన్ షిప్ లో ఉన్న సుసానే
  • సాబా అజాద్ తో డేటింగ్ చేస్తున్న హృతిక్   
బాలీవుడ్ లో క్యూట్ కపుల్ గా పేరుగాంచిన హృతిక్ రోషన్, సుసానే ఖాన్ లు విడాకులు తీసుకున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం హృతిక్ రోషన్ బాలీవుడ్ నటి, సింగర్ సాబా అజాద్ తో డేటింగ్ చేస్తుండగా... తన ప్రియుడు అర్స్లాన్ గోనీతో సుసానే రిలేషన్ షిప్ లో ఉంది. 

తాజాగా సుసానే, ఆమె బోయ్ ఫ్రెండ్ పెళ్లి చేసుకోబోతున్నారనే వార్త వైరల్ అవుతోంది. వీరిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారని... అయితే సుసానేకు ఇది రెండో పెళ్లి కావడం వల్ల.. వీరి మ్యారేజ్ చాలా సింపుల్ గా ఉండబోతోందని ఎంటర్టైన్మెంట్ కు సంబంధించిన ఓ మీడియా సంస్థ కథనాన్ని ప్రచురించింది. 

హృతిక్ రోషన్, సుసానేలు 14 ఏళ్ల వైవాహిక జీవితం తర్వాత విడిపోయారు. వీరికి ఇద్దరు కుమారులు ఉన్నారు. ఇద్దరూ విడాకులు తీసుకున్నప్పటికీ... పిల్లలతో అప్పుడప్పుడు సమయాన్ని కలిపి గడుపుతుంటారు. బాలీవుడ్ నటి కంగనా రనౌత్ తో హృతిక్ రోషన్ కు వివాదం నడుస్తున్న సమయంలో కూడా తన మాజీ భర్తకు ఆమె మద్దతుగా నిలిచారు.
Go Back to Shorts
Sussane Khan
Boy Friend
Marriage
Hrithik Roshan
Bollywood

More Telugu News