బీబీకా ఆలంలో వైఎస్ ష‌ర్మిల మొహ‌ర్రం పూజ‌లు... ఫొటోలు ఇవిగో

ys sharmila prayers at bibika alam
  • హైద‌రాబాద్ పాత‌బ‌స్తీలో ప‌ర్య‌టించిన వైఎస్ ష‌ర్మిల‌
  • మొహ‌ర్రం సందర్భంగా ముస్లింల‌తో క‌లిసి ప్రార్థ‌న‌లు  
  • ఉద‌యం జ‌య‌శంక‌ర్‌కు నివాళి అర్పించిన వైనం
ముస్లింల పండుగ మొహ‌ర్రం ప‌ర్వ‌దినాన్ని పుర‌స్క‌రించుకుని వైఎస్సార్టీపీ అధినేత్రి వైఎస్ ష‌ర్మిల శ‌నివారం హైద‌రాబాద్ పాత‌బ‌స్తీలో ప‌ర్యటించారు. ప‌ర్య‌ట‌న‌లో భాగంగా బ‌బీర్‌పురా ప‌రిధిలోని బీబీకా ఆలం వెళ్లిన ష‌ర్మిల‌... అక్క‌డ ముస్లింల‌తో క‌లిసి ప్ర‌త్యేక ప్రార్థ‌న‌లు చేశారు. ఈ సంద‌ర్భంగా ఆమె మొహ‌ర్రం ప‌ర్వ‌దినం గురించి ప్ర‌త్యేకంగా ప్ర‌స్తావించారు. 

పోరాటానికి, త్యాగానికి ప్ర‌తీకైన మొహ‌ర్రం ప్ర‌తి ఒక్క‌రిలో పోరాట స్ఫూర్తిని, త్యాగనిరతిని నింపాల‌ని కోరుకుంటున్నానని ఆమె పేర్కొ‌న్నారు. అల్లా కృప ప్ర‌జ‌లంద‌రిపైనా ఉండాల‌ని ఆమె ఆకాంక్షించారు. ఇదిలా ఉంటే... శ‌నివారం తెలంగాణ ఉద్య‌మ స్ఫూర్తి ప్ర‌దాత ప్రొఫెస‌ర్ జ‌య‌శంక‌ర్ వ‌ర్ధంతిని పుర‌స్కరించుకుని జ‌య‌శంక‌ర్‌కు నివాళి అర్పించారు.
.
Go Back to Shorts
YSRTP
YS Sharmila
Hyderabad
Old City
Moharrum

More Telugu News