తెలంగాణలో తాజాగా 984 కరోనా పాజిటివ్ కేసులు

  • గత 24 గంటల్లో 40,663 కరోనా పరీక్షలు
  • హైదరాబాదులో 365 కొత్త కేసులు
  • కరోనా నుంచి కోలుకున్న 923 మంది
  • ఇంకా 6,418 మందికి చికిత్స
తెలంగాణలో కరోనా వైరస్ వ్యాప్తి కొనసాగుతోంది. గడచిన 24 గంటల్లో 40,663 కరోనా పరీక్షలు నిర్వహించగా, 984 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. హైదరాబాదులో అత్యధికంగా 365 కొత్త కేసులు నమోదయ్యాయి. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో 61, రంగారెడ్డి జిల్లాలో 57, నల్గొండ జిల్లాలో 41 కేసులు గుర్తించారు. ఇంకా 687 మంది ఫలితాలు వెల్లడి కావాల్సి ఉంది. 

అదే సమయంలో 923 మంది కరోనా నుంచి కోలుకున్నారు. కొత్తగా ఎలాంటి మరణాలు సంభవించలేదు. తెలంగాణలో ఇప్పటివరకు 8,24,708 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా... 8,14,179 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 6,418 మంది చికిత్స పొందుతున్నారు. రాష్ట్రంలో కరోనాతో ఇప్పటిదాకా 4,111 మంది మరణించారు.

Telangana
Corona Virus
Update
New Cases

More Telugu News