పారిస్ లోని ఓ సెలూన్లో అమితాబ్ బచ్చన్ ఫొటోతో ప్రచారం
- భారత నట దిగ్గజంగా అమితాబ్ బచ్చన్
- అంతర్జాతీయంగానూ గుర్తింపు
- ఓ హాలీవుడ్ చిత్రంలో ప్రత్యేకపాత్ర
- పారిస్ లో తన ఫొటోపై అమితాబ్ ఆశ్చర్యం
కాగా, ఫ్రాన్స్ రాజధాని పారిస్ లో ఓ సెలూన్లో అమితాబ్ బచ్చన్ ఫొటోతో ప్రచారం చేసుకుంటుండడం విశేషం. దీనికి సంబంధించిన ఫొటోను అమితాబ్ సోషల్ మీడియాలో పంచుకున్నారు. పారిస్ లోని ఓ హెయిర్ డ్రెస్సింగ్ సెలూన్లో తన ఫొటోను ప్రదర్శిస్తుండగా, ఓ వ్యక్తి కంటబడిందని వెల్లడించారు. దేవుడా... ఇదెక్కడి విడ్డూరం... భలేగుందే! అంటూ ఆయన విస్మయం వ్యక్తం చేశారు.