ప్రభుత్వ కార్యక్రమంలో తమపై వైసీపీ దాడి చేసిందంటూ వీడియో పోస్ట్ చేసిన టీడీపీ ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు

  • పాల‌కొల్లులో ప్రభుత్వ కార్యక్రమం ‌
  • హాజ‌రైన ఎమ్మెల్యే నిమ్మ‌ల‌, ఎమ్మెల్సీలు 
  • వైసీపీ మోసం, దగా బయటపడుతుందనే మాట్లాడకుండా చేశారన్న నిమ్మల   
ప‌శ్చిమ గోదావ‌రి జిల్లా పాలకొల్లులో జరిగిన ప్ర‌భుత్వ అధికారిక కార్య‌క్ర‌మంలో తమపై దాడి జరిగిందని స్థానిక టీడీపీ ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు ట్విట్టర్లో పేర్కొన్నారు. శాసనసభ్యుడు, శాసన మండలి సభ్యులపై వైసీపీ నేతలు దాడికి దిగినట్టు ఆయన తెలిపారు. రెండు లక్షల రూపాయల అద్దె భారం లబ్ధిదారులపై పెట్టడం, ముంపు భూముల్లో సెంటు పట్టాలు ఇచ్చిన వైసీపీ మోసం, దగా బయటపడుతుందనే స్థానిక శాసనసభ్యులు, శాసనమండలి సభ్యులు మాట్లాడకుండా చేశారనీ, వైసీపీ మంత్రులు దొంగల్లా పారిపోయారని రామానాయుడు విమర్శించారు. ఇందుకు సంబంధించిన వీడియోను కూడా ఆయన పోస్ట్ చేశారు. 

 


More Telugu News

TDP Nimmala Rama Naidu YSRCP West Godavari District Palakollu