కాంగ్రెస్ కు మరో షాక్.. పార్టీకి రాజీనామా చేయనున్న దాసోజు శ్రవణ్?

Dasoju Sravan resigns to Congress Party
  • పార్టీ అంతర్గత వ్యవహారాలపై అసంతృప్తితో ఉన్న శ్రవణ్
  • ఇటీవలే కాంగ్రెస్ పార్టీలో చేరిన విజయారెడ్డి
  • ఖైరతాబాద్ స్థానంలో నెలకొన్న పోటీ
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి మరో భారీ షాక్ తగలబోతున్నట్టు తెలుస్తోంది. కాంగ్రెస్ పార్టీకి ఏఐసీసీ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్ రాజీనామా చేయనున్నారని సమాచారం. కాంగ్రెస్ పార్టీలో అంతర్గతంగా జరుగుతున్న పరిణామాలపై ఆయన కొంత కాలంగా అసంతృప్తితో ఉన్నారని తెలుస్తోంది. 

దివంగత పీజేఆర్ కుమార్తె విజయారెడ్డి ఇటీవలే కాంగ్రెస్ పార్టీలో చేరారు. గత ఎన్నికల్లో ఖైతరాబాద్ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన దాసోజు శ్రవణ్ ఓడిపోయారు. ఇప్పుడు ఖైరతాబాద్ నుంచి పోటీ చేసేందుకు విజయారెడ్డి కూడా ప్రయత్నిస్తుండటం పట్ల శ్రవణ్ అసహనం వ్యక్తం చేస్తున్నారు. తాను పోటీ చేస్తున్న స్థానంలో సొంత పార్టీలోనే పోటీ నెలకొనడాన్ని ఆయన జీర్ణించుకోలేకపోతున్నారు. ఈ పరిణామాలన్నింటి నేపథ్యంలో ఆయన పార్టీకి రాజీనామా చేయాలనే నిర్ణయానికి వచ్చినట్టు చెపుతున్నారు. 

ఇప్పటికే కాంగ్రెస్ కు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి దూరమయ్యారు. ఈ దుమారం నుంచి పార్టీ ఇంకా కోలుకోక ముందే దాసోజు శ్రవణ్ రాజీనామా చేయనున్నారనే అంశం తెరపైకి రావడం పార్టీ శ్రేణులను దిగ్భ్రాంతికి గురి చేస్తోంది. ఈ సాయంత్రం మీడియాతో ఆయన మాట్లాడనున్నట్టు సమాచారం. ఈ మీడియా సమావేశంలో ఆయన తన నిర్ణయాన్ని వెల్లడించే అవకాశం ఉంది.
Go Back to Shorts
Dasoju Sravan
Congress
Resign

More Telugu News