గవర్నర్ తమిళిసైతో తెలంగాణ వర్సిటీల విద్యార్థుల భేటీ
- రాజ్‌భవన్‌కు వచ్చిన బాసర ట్రిపుల్ ఐటీ, ఉస్మానియా వర్సిటీ, వరంగల్ నిట్, తెలంగాణ వర్సిటీ విద్యార్థులు
- విద్యాలయాల్లోని సమస్యలపై గవర్నర్‌కు వినతి పత్రం సమర్పణ
- సమస్యలను పరిష్కరించేలా చూడాలని అభ్యర్థన
ఈ సందర్భంగా ఆయా విశ్వవిద్యాలయాల్లో నెలకొన్న సమస్యలపై విద్యార్థులు గవర్నర్‌కు వినతి పత్రం సమర్పించారు. వసతుల లేమి, నాసిరకం భోజనం, ఆయా విద్యా సంస్థలకు రెగ్యులర్ వీసీలు లేని పరిస్థితులపై వారంతా గవర్నర్‌కు వివరించారు. ఈ సమస్యలను పరిష్కరించేలా ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేయాలని విద్యార్థులు గవర్నర్‌ను కోరారు.