తెలంగాణ కమాండ్ కంట్రోల్ భవనం ప్రారంభోత్సవం రేపే... ఇవిగో ఫొటోలు
- హైదరాబాద్‌లో నూతనంగా నిర్మించిన కమాండ్ కంట్రోల్ భవనం
- ప్రపంచ శ్రేణి నిర్మాణమంటూ కేటీఆర్ ట్వీట్
- దేశంలో అత్యంత సౌకర్యవంతమైన ప్రభుత్వ భవనంగా గుర్తింపు ఖాయమని వెల్లడి
- గురువారం ప్రారంభించనున్న కేసీఆర్
తెలంగాణ రాష్ట్ర పోలీస్ సమీకృత కమాంట్ అండ్ కంట్రోల్ సెంటర్ (టీఎస్‌పీఐసీసీసీ) పేరిట నిర్మించిన ఈ భవనం ప్రపంచ శ్రేణి ప్రమాణాలతో నిర్మించినట్లు కేటీఆర్ తెలిపారు. దేశంలోనే అత్యంత సౌకర్యవంతమైన ప్రభుత్వ భవనంగా దీనికి గుర్తింపు లభించనుంది అని ఆయన పేర్కొన్నారు. గురువారం ఈ భవనాన్ని సీఎం కేసీఆర్ ప్రారంభించనున్నట్లు కేటీఆర్ తెలిపారు.