Hyderabad: ఇంటర్నెట్ లో హైదరాబాద్ ‘గ్యాంగ్ రేప్’ వీడియోలు.. పోలీసుల కఠిన చర్యలు

Hyderabad gang rape videos active on social media
  • మహిళా పోలీసు విభాగాన్ని ఆశ్రయించిన బాధిత కుటుంబం
  • ఫొటోలు, వీడియోల ఆధారాల అందజేత
  • వాటిని తొలగించేందుకు చర్యలు చేపట్టనున్న పోలీసులు
  • అప్ లోడ్ చేసిన వారిపైనా చర్యలు
హైదరాబాద్ లోని ఓ పబ్ లో పరిచయమైన 17 ఏళ్ల బాలికను కారులో తీసుకెళ్లి సామూహిక అత్యాచారం చేసిన ఘటన వీడియోలు, ఫొటోలు ఇప్పటికీ సామాజిక మాధ్యమాల్లో చలామణీ అవుతున్నాయి. దీనిపై బాధిత కుటుంబం మహిళా పోలీసు విభాగాన్ని ఆశ్రయించింది. ఫొటోలు, వీడియో లింక్ ల వివరాలను అందించింది. దీంతో ఆయా ఫొటోలు, వీడియోలు తొలగించాలని కోరుతూ సామాజిక మాధ్యమ సంస్థలను హైదరాబాద్ సిటీ పోలీసులు లిఖితపూర్వకంగా కోరనున్నారు. 

మరోవైపు వీటిని అప్ లోడ్ చేసిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని పోలీసులు భావిస్తున్నారు. ఇందులో బాలిక ముఖం కనిపిస్తుండడం పట్ల బాధిత కుటుంబం ఆందోళన వ్యక్తం చేసింది. జూన్ 3, 4వ తేదీల్లో ఈ వీడియోలు, ఫొటోలను అప్ లోడ్ చేసినట్టు గుర్తించారు. దీనిపై పలువురు కామెంట్లు పెట్టినట్టు, 2,000 మంది లైక్ చేసినట్టు తెలిసింది.
Hyderabad
gang rape
videos
social media
police

More Telugu News