చెన్నైలో మరో భారీ విమానాశ్రయం... సీఎం స్టాలిన్ ప్రకటన
- చెన్నైలో ఇప్పటికే ఓ అంతర్జాతీయ విమానాశ్రయం
- పెరుగుతున్న ప్రయాణికుల సంఖ్య
- కార్గో సేవలకు డిమాండ్
- కొత్త ఎయిర్ పోర్టు తప్పనిసరి అని పేర్కొన్న స్టాలిన్
- రూ.20 వేల కోట్లతో విమానాశ్రయం
రూ.20 వేల కోట్ల ఖర్చుతో ఈ ఎయిర్ పోర్టును నిర్మిస్తామని, సాలీనా 10 కోట్ల మంది ప్రయాణించేందుకు వీలుగా ఈ విమానాశ్రయాన్ని తీర్చిదిద్దుతామని సీఎం స్టాలిన్ వివరించారు. దీంట్లో 2 రన్ వేలు, ప్రయాణికుల టెర్మినల్ భవనాలు, కార్గో టెర్మినల్, ట్యాక్సీ వేలు, యాప్రాన్ ఉంటాయని వివరించారు.
విమానాల్లో ప్రయాణించే వారి సంఖ్య పెరుగుతుండడం, సరకు రవాణా రంగంలో ఏర్పడిన డిమాండ్ ను దృష్టిలో ఉంచుకుని ఈ కొత్త ఎయిర్ పోర్టు నిర్మాణం చేపడుతున్నట్టు స్పష్టం చేశారు.