వైసీపీ మహిళా విభాగం కర్నూలు జిల్లా అధ్యక్షురాలిగా మాజీ ఎంపీ బుట్టా రేణుక
- 2014 వైసీపీ టికెట్‌పై ఎంపీగా గెలిచిన బుట్టా
- ఆ తర్వాత వైసీపీని వీడి టీడీపీలో చేరిన వైనం
- 2019 ఎన్నికలకు ముందు తిరిగి సొంత గూటికి చేరిక
అటు ప్రజా ప్రతినిధిగా అవకాశం దక్కక... ఇటు పార్టీలో పదవి దక్కక చాలా కాలంగా బుట్టా రేణుక రాజకీయంగా స్తబ్దుగా ఉండిపోయారు. తాజాగా వైసీసీ మహిళా విభాగం కర్నూలు జిల్లా అధ్యక్షురాలిగా ఆమెను నియమిస్తూ ఆ పార్టీ మంగళవారం నిర్ణయం తీసుకుంది. పార్టీ జాతీయ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆదేశాల మేరకే బుట్టా రేణుకను ఆ పదవిలో నియమిస్తున్నట్లు వైసీపీ కేంద్ర కార్యాలయం మంగళవారం ఓ ప్రకటన విడుదల చేసింది.