గుంటూరు-తిరుపతి ఎక్స్ ప్రెస్ రైలు ఆగస్టు 18న పునఃప్రారంభం
- కరోనా సమయంలో నిలిచిన పలు రైళ్లు
- క్రమంగా రైళ్ల పునరుద్ధరణ
- 7 జిల్లాల మీదుగా గుంటూరు-తిరుపతి రైలు పయనం
- రైల్వేమంత్రికి కృతజ్ఞతలు తెలిపిన ఏపీ బీజేపీ నేతలు
ఈ రైలు నరసరావుపేట, వినుకొండ, దొనకొండ, మార్కాపురం రోడ్, కంభం, గిద్దలూరు, నంద్యాల, బనగానపల్లె, ప్రొద్దుటూరు, ఎర్రగుంట్ల, కమలాపురం, కడప, నందలూరు, రాజంపేట, కోడూరు, రేణిగుంట మీదుగా ప్రయాణిస్తుంది. కాగా, గుంటూరు-తిరుపతి ఎక్స్ ప్రెస్ రైలును పునరుద్ధరించడంపై ఏపీ బీజేపీ నేతలు రైల్వేశాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ కు కృతజ్ఞతలు తెలిపారు.