'పుష్ప 2' కోసం విజయ్ సేతుపతి జోడీగా ప్రియమణి!

Pushpa movie update
  • తెలుగులో మళ్లీ బిజీ అవుతున్న ప్రియమణి 
  • 'నారప్ప'లోని నటనకు దక్కిన ప్రశంసలు
  • 'విరాటపర్వం'లోను మెప్పించిన ప్రియమణి 
  • 'పుష్ప 2'లోను డిఫరెంట్ రోల్ పడినట్టుగా టాక్   
ఒకప్పుడు కథానాయికగా తెలుగు .. తమిళ భాషల్లో మంచి పేరు తెచ్చుకున్న ప్రియమణి, రీ ఎంట్రీలోను మంచి అవకాశాలనే అందుకుంటోంది. ఈ మధ్య వచ్చిన 'నారప్ప' సినిమాలో ఆమెకి మంచి పాత్రపడింది. ఆ తరువాత ఇటీవల వచ్చిన 'విరాటపర్వం' సినిమాలోను కీలకమైన పాత్రనే పోషించింది.

ఇక తాజాగా ఆమెను 'పుష్ప 2' సినిమా కోసం తీసుకున్నట్టుగా ఒక వార్త షికారు చేస్తోంది. వచ్చేనెల నుంచి 'పుష్ప 2'ను సెట్స్  పైకి తీసుకుని వెళ్లే దిశగా సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ సినిమాలో ముఖ్యమైన పాత్రల కోసం బాలీవుడ్ నుంచి మనోజ్ బాజ్ పాయ్ నీ .. కోలీవుడ్ నుంచి విజయ్ సేతుపతిని ఎంపిక చేసుకున్నట్టుగా ప్రచారం జరిగింది. 

విజయ్ సేతుపతి జోడీగా ప్రియమణిని ఎంపిక చేశారనేది తాజా సమాచారం. ఆ పాత్రకి కూడా ప్రాముఖ్యత ఉండటం వల్లనే ఆమెను తీసుకున్నట్టుగా చెబుతున్నారు. అప్పుడే దేవిశ్రీ ఈ సినిమాకి బాణీలు కట్టే పనిలో పడిపోయాడని అంటున్నారు. వచ్చే వేసవిలో ఈ సినిమాను విడుదల చేయాలనే ఆలోచనలో ఉన్నారు.
Go Back to Shorts
Allu Arjun
Rashmika Mandanna
Sukumar
Pushpa 2 Movie

More Telugu News