హైదరాబాద్‌లో కాల్పుల కలకలం.. రియల్ ఎస్టేట్ వ్యాపారి హత్య
- మాదాపూర్‌లో ఈ తెల్లవారుజామున ఘటన
- కారులో వెళ్తున్న రియల్ ఎస్టేట్ వ్యాపారిపై కాల్పులు
- పాయింట్ బ్లాంక్‌లో మొత్తం ఆరు రౌండ్లు కాల్పులు జరిపిన దుండగుడు
ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. ఒక్కసారిగా కాల్పులు మోతెక్కడంతో ఆ దారిన వెళ్తున్న వాహనదారులు భయంతో వణికిపోయారు. స్థిరాస్తికి సంబంధించిన గొడవలే ఈ ఘటనకు కారణమని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. నిందితుడు ముజీబ్ కోసం గాలిస్తున్నారు.