Mann Ki Baat: గుంతకల్ లో పెళ్లికి వచ్చిన వారికి 'మోదీ మన్ కీ బాత్' కార్యక్రమం చూపించారు!

  • మన్ కీ బాత్ ద్వారా ప్రసంగించిన మోదీ
  • దేశవ్యాప్తంగా ప్రసారం
  • క్రమం తప్పకుండా మన్ కీ బాత్ ను చూసే వధూవరులు
  • పెళ్లి వేదికపైనా ఆనవాయతీ తప్పని కొత్త దంపతులు
Modi Mann Ki Baat at a marriage in Guntakal

ప్రధాని నరేంద్ర మోదీ జాతినుద్దేశించి ప్రసంగించే కార్యక్రమం మన్ కీ బాత్. ప్రధాని తన మనసులో మాటను వెల్లడించే ఈ కార్యక్రమాన్ని దేశవ్యాప్తంగా వీక్షిస్తుంటారు. ఆసక్తి కలిగించే అంశం ఏమిటంటే... గుంతకల్ లో ఓ పెళ్లిలోనూ మన్ కీ బాత్ కార్యక్రమాన్ని ప్రసారం చేశారు. వధూవరులు క్రమం తప్పకుండా ప్రధానమంత్రి మన్ కీ బాత్ కార్యక్రమాన్ని వీక్షిస్తారట. 

అయితే, వివాహ మహోత్సవం సందర్భంగానూ వారు ఈ ఆనవాయతీని తప్పలేదు. పెళ్లి వేదిక వద్దే భారీ స్క్రీన్ ఏర్పాటు చేసి మన్ కీ బాత్ కార్యక్రమాన్ని వీక్షించారు. ఈ పెళ్లికి ముఖ్య అతిథిగా బీజేపీ జాతీయ కార్యదర్శి వై.సత్యకుమార్, బీజేపీ రాష్ట్ర కార్యదర్శి ఎస్.విష్ణువర్ధన్ రెడ్డి, జిల్లా పార్టీ నేతలు కూడా హాజరయ్యారు. వారు కూడా ఈ పెళ్లిలోనే మన్ కీ బాత్ కార్యక్రమాన్ని తిలకించారు. దీనికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో సందడి చేస్తోంది.

More Telugu News