Vishnu Vardhan Reddy: ప్రత్యేకహోదా పేరుతో ఇంకెన్నాళ్లు రాష్ట్ర ప్రజలను మోసం చేస్తారు?: బీజేపీ నేత విష్ణువర్ధన్ రెడ్డి

Vishnu Vardhan Reddy fires on AP govt over special status issue
  • ప్రత్యేకహోదా అంశంపై విష్ణు విమర్శలు
  • గత ప్రభుత్వం ప్యాకేజీకి అంగీకరించిందని స్పష్టీకరణ
  • నిధులు తీసుకోలేదని సీఎం ప్రకటిస్తారా అని నిలదీసిన విష్ణు
  • సజ్జల దీనిపై మాట్లాడతారా? అంటూ ప్రశ్న  
ఏపీకి ప్రత్యేక హోదా అంశంపై రాష్ట్ర బీజేపీ ప్రధాన కార్యదర్శి ఎస్.విష్ణువర్ధన్ రెడ్డి స్పందించారు. ప్రత్యేక హోదా పేరుతో ఇంకెన్నాళ్లు రాష్ట్ర ప్రజలను మోసం చేస్తారంటూ వైసీపీ ప్రభుత్వాన్ని నిలదీశారు. తమకు ప్రత్యేక హోదా వద్దని 2017లోనే అప్పటి ప్రభుత్వం ప్యాకేజీకి అంగీకరించిందని కేంద్ర ప్రభుత్వం పార్లమెంటులో వెల్లడించిందని విష్ణువర్ధన్ రెడ్డి తెలిపారు.

ప్యాకేజీ కింద దేశంలో ఎక్కడా లేనివిధంగా 17 ప్రాజెక్టులు ఇచ్చామని, అందుకు గాను రూ.7,798 కోట్ల నిధులు తీసుకుందని కూడా కేంద్రం చెప్పిందని వివరించారు. మరి, ఈ 17 ప్రాజెక్టులు మేం తీసుకోలేదని, రూ.7,798 కోట్లు మేం తీసుకోలేదని ముఖ్యమంత్రి ప్రకటిస్తారా? అని విష్ణువర్ధన్ రెడ్డి ప్రశ్నించారు. లేకపోతే, రోజు మీడియా ముందు కూర్చుని ఉపన్యాసాలు చెప్పే సజ్జల రామకృష్ణారెడ్డి దీని గురించి మాట్లాడతారా? అని నిలదీశారు. 

కేంద్ర ప్రభుత్వం ఏపీకి విశాఖపట్నం-చెన్నై కారిడార్ కు రూ.1,859 కోట్లు, నాడు-నేడు ఆరోగ్యమిషన్ కు రూ.935 కోట్లు, పవర్ ప్రాజెక్టులకు రూ.897 కోట్లు, గ్రామీణ రహదారులకు సంబంధించి రూ.825 కోట్లు ఇచ్చిందని విష్ణువర్ధన్ రెడ్డి వివరించారు.
Vishnu Vardhan Reddy
AP Special Status
YSRCP
Jagan
Sajjala Ramakrishna Reddy'
Chandrababu
Andhra Pradesh

More Telugu News