Karvy: కార్వీకి చెందిన మ‌రో రూ.110 కోట్ల ఆస్తులను సీజ్ చేసిన ఈడీ

ED has provisionally attached assets worth 110 Crores rupees of karvy
  • ఇప్ప‌టికే రూ.1,985 కోట్ల ఆస్తుల సీజ్‌
  • తాజా జ‌ప్తుతో రూ.2,095 కోట్ల‌కు చేరిన ఆస్తుల సీజ్‌
  • జ‌ప్తు ఆస్తుల్లో కార్వీతో పాటు పార్థ‌సార‌థి ఆస్తులు కూడా 
స్టాక్ బ్రోకింగ్‌లో మొన్న‌టిదాకా న‌మ్మ‌క‌మైన సంస్థ‌గా గుర్తింపు సంపాదించిన కార్వీపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్ట‌రేట్ (ఈడీ) మ‌రోమారు పంజా విసిరింది. ఆ సంస్థ య‌జ‌మాని పార్థసార‌ధి ద‌ర్యాప్తు సంస్థ‌ల‌కు అడ్డంగా బుక్ అయిన సంగ‌తి తెలిసిందే. ఈ వ్య‌వ‌హారంపై ఇప్ప‌టికే కేసులు న‌మోదు చేసిన ఈడీ... ఇటీవ‌లే సంస్థ యజ‌మాని పార్థ‌సార‌థిని అరెస్ట్ చేసిన సంగ‌తి తెలిసిందే. 

ఇప్ప‌టికే రూ.1,985 కోట్ల ఆస్తులను సీజ్‌ చేసిన ఈడీ.. తాజాగా కార్వీకి చెందిన రూ.110 కోట్ల ఆస్తుల‌ను ఈడీ అధికారులు సీజ్ చేశారు. తాజా సీజ్‌తో కార్వీకి చెందిన రూ.2,095 కోట్ల ఆస్తుల‌ను ఈడీ సీజ్ చేసిన‌ట్టయింది.
Karvy
Enforcement Directorate
PMLA
Parthasarathy

More Telugu News