మాజీ సైనికుల అనాథ పిల్లలకు నెలవారీ సాయం పెంపు: రాజ్‌నాథ్ సింగ్
- ఇప్పటి వరకు నెలకు రూ. 1,000 సాయం
- ఈ సాయాన్ని రూ. 3 వేలకు పెంపు
- 21 ఏళ్ల లోపు అవివాహిత పిల్లలు ఈ పథకానికి అర్హులు
రక్షణ దళాల్లో సేవలందించిన వారి కుటుంబాల పట్ల మానవతా దృక్పథంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు చెప్పారు. పెంచిన సాయంతో అనాథ పిల్లలు గౌరవప్రదంగా మెరుగైన జీవితాన్ని జీవించేందుకు అవకాశం కలుగుతుందని తెలిపారు. కేంద్రీయ సైనిక్ బోర్డు నిర్వహిస్తున్న పథకం ద్వారా ఈ సాయాన్ని మాజీ సైనికుల అనాథ పిల్లలకు అందిస్తారు. 21 సంవత్సరాల లోపు వయసున్న అవివాహిత కుమార్తె, కుమారుడు ఈ పథకానికి అర్హులు.