Simbu: శింబు హీరోగా మురుగదాస్ మూవీ!

Simbu in Murugadoss Movie
షార్ట్స్‌లో చూడండి
మురుగదాస్ .. శంకర్ తరువాత కోలీవుడ్ సినిమాల తీరును ప్రభావితం చేసిన దర్శకుడు. తమిళ సినిమాల మార్కెట్ ను పెంచడమే కాకుండా, తన సినిమాల రీమేకుల హక్కుల కోసం ఇతర భాషల మేకర్స్ పోటీపడేలా చేసిన దర్శకుడు. బాలీవుడ్ స్టార్స్ సైతం పిలిపించుకుని తమకి ఒక సినిమా చేసి పెట్టమని అడిగించుకున్న దర్శకుడు.

రజనీతో 'దర్బార్' తరువాత ఆయన నుంచి మరో సినిమా రాలేదు. వీలైతే బాలీవుడ్ హీరోతో .. లేదంటే బన్నీతో ఒక సినిమా చేయాలని ఆయన అనుకున్నాడుగానీ కుదరలేదు. దాంతో శింబుతో ప్రాజెక్టును ఖాయం చేసుకున్నట్టుగా తెలుస్తోంది. త్వరలోనే ఈ కాంబో సెట్స్ పైకి వెళ్లనుందని అంటున్నారు.

చాలా కాలంగా సరైన హిట్ కోసం వెయిట్ చేస్తూ వచ్చిన శింబు, ఇటీవలే 'మానాడు' సినిమాతో పెద్ద హిట్ కొట్టాడు. మురుగదాస్ వినిపించిన కథను వెంటనే ఆయన ఓకే చేశాడని అంటున్నారు. ఇప్పటికే గ్యాప్ రావడంతో, ఈ సినిమాను సాధ్యమైనంత త్వరగా పూర్తిచేయాలనే ఆలోచనలో మురుగదాస్ ఉన్నాడు. ఈ సినిమాను వచ్చే ఏడాదిలో విడుదల చేయాలనే ఆలోచనలో ఉన్నారు.
Go Back to Shorts
Simbu
Murigadoss Movie
Kollywood

More Telugu News