గోదావరి వరదలో కొట్టుకుపోయిన వనదుర్గ ఆలయం.. వీడియో వైరల్
- పురుషోత్తపట్నంలో ఘటన
- 15 ఏళ్ల క్రితం వనదుర్గ ఆలయం నిర్మాణం
- శ్రావణమాసం తొలి శుక్రవారం సందర్భంగా నిన్న పూజలు
- అందరూ చూస్తుండగానే కొట్టుకుపోయిన ఆలయం
వరద తాకిడికి తీరం కోతకు గురికావడంతో మధ్యాహ్నానికే ఆలయం బీటలు వారి ఓ వైపునకు ఒరిగిపోయింది. సాయంత్రానికి ఒక్కసారిగా నదిలో పడిపోయి కొట్టుకుపోయింది. ఆలయం కొట్టుకుపోవడం ఖాయమని ముందే గ్రహించిన గ్రామస్థులు గుడిలోకి ఎవరూ వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవడంతో ప్రమాదం తప్పింది. ఆలయం నదిలో పడిపోతున్న సమయంలో గ్రామస్థులు తీసిన వీడియోలు సోషల్ మీడియాకెక్కాయి.