బర్మింగ్హామ్ చేరుకున్న సింధుకు కొవిడ్ సోకినట్టు అనుమానం.. రెండోసారి పరీక్షలో నెగటివ్
- ఆర్టీపీసీఆర్ టెస్టులో పీవీ సింధుకు అనుమాన ఫలితం
- పర్యవేక్షణలో ఉంచిన అధికారులు
- క్రీడా గ్రామంలోకి వెళ్లేందుకు అనుమతి నిరాకరణ
- రెండోసారి నెగటివ్ రావడంతో ఊపిరి పీల్చుకున్న అధికారులు
ఆమెను పర్యవేక్షణలో ఉంచినట్టు భారత అధికారులు కూడా తెలిపారు. అయితే, రెండోసారి నిర్వహించిన ఆర్టీపీసీఆర్ పరీక్షలో సింధుకు నెగటివ్ రావడంతో భారత బృందం ఊపిరి పీల్చుకుంది. సింధుకు కొవిడ్ సోకలేదని నిర్ధారణ అయ్యాక ఆమెను కామన్వెల్త్ క్రీడా గ్రామంలోకి అనుమతించారు.