ఉదయనిధి స్టాలిన్ హీరోగా సినిమా నిర్మిస్తున్న కమలహాసన్
- ఉదయనిధి ఇండస్ట్రీలో అడుగు పెట్టి పదేళ్లు పూర్తి
- గత ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలిచిన ఉదయనిధి
- సినిమాలకు గుడ్ బై చెబుతున్నట్టు మూడు నెలల కిందట ప్రకటన
- మనసు మార్చుకొని కొత్త సినిమాకు ఓకే చెప్పిన ఉదయనిధి
కమలహాసన్ హీరోగా ఆయన సొంత బ్యానర్ అయిన రాజ్ కమల్ ఇంటర్నేషనల్ నిర్మించిన ‘విక్రమ్’ సినిమా బ్లాక్ బస్టర్ సాధించింది. ఉదయనిధికి చెందిన రెడ్ జాయింట్ మూవీస్ సంస్థ ఈ సినిమాని తమిళంలో పంపిణీ చేసింది. సంస్థను ప్రారంభించి పదమూడేళ్లయిన సందర్భంగా ఇటీవల ఓ వేడుక నిర్వహించారు. ఇదే వేదికపై తమ రాజ్ కమల్ ఫిల్మ్స్ బ్యానర్‌లో ఉదయనిధి హీరోగా సినిమాని నిర్మించనున్నట్టు కమల్ ప్రకటించారు. మహేశ్ నారాయణ్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తాడు. హీరోగా తనకి గొప్ప అవకాశాన్ని ఇచ్చారంటూ కమలహాసన్‌కు ఉదయనిధి కృతజ్ఞతలు తెలిపారు.