మంచి సినిమా ఉంటే చెప్పండని అడిగావు కదా.. ఈ సినిమా చూడు: కేటీఆర్ కు రాజాసింగ్ సూచన
- టీఆర్ఎస్ ఎంపీలను పార్లమెంటు నుంచి సస్పెండ్ చేశారన్న కేటీఆర్
- బీజేపీ ఎమ్మెల్యేలను మీరు ఒక సెషన్ మొత్తం సస్పెండ్ చేయడం మర్చిపోయావా? అన్న రాజాసింగ్
- 'కశ్మీర్ ఫైల్స్' సినిమా చూడాలని సూచన
కాలికి దెబ్బతగలడంతో ఇంట్లోనే ఉంటున్న కేటీఆర్.. కాలక్షేపానికి ఓటీటీలో మంచి షోలను సూచించాలని అడిగిన సంగతి తెలిసిందే. దీంతో, కేసీఆర్ పై విపక్ష నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. ఇదే అంశంపై రాజా సింగ్ మాట్లాడుతూ, 'కాలు విరిగిందని ఇంట్లో కూర్చున్నావు కదా. మంచి సినిమా ఉంటే చెప్పండని అడిగావు కదా. నేను ఒక సినిమా చెపుతా చూస్కో. 'కాశ్మీర్ ఫైల్స్' సినిమా చూడు. లేకపోతే ప్రధాని మోదీ స్పీచ్ కానీ, దివంగత అటల్ బిహారీ వాజ్ పేయి హిస్టరీ కానీ చూడు. మంచి మనిషివి అవుతావ్. నాస్తికుడివైన నీవు ఆస్తికుడివి అవుతావు. నీకు ఇది నా అడ్వైజ్' అని చెప్పారు.