ఎన్నికలు ఎప్పుడు వచ్చినా టీడీపీ సిద్ధం: బుద్ధా వెంకన్న
- విశాఖలో పార్టీ జోన్ 1 సమావేశం
- ముఖ్య అతిథిగా హాజరైన బుద్ధా వెంకన్న
- ఉత్తరాంధ్రలోని అన్ని సీట్లను గెలుస్తామని ధీమా
రాష్ట్రంలో సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డితో పాటు వైసీపీ నాయకులకు ధన దాహం ఉందని వెంకన్న ఆరోపించారు. ప్రజావ్యతిరేక విధానాలు అవలంబిస్తున్న ప్రభుత్వ తీరుని ప్రశ్నిస్తున్న వాళ్లపై అక్రమ కేసులు పెడుతున్నారన్నారు. మద్యనిషేధం పేరుతో డబ్బంతా తాడేపల్లికి వెళుతోందని ఆయన తెలిపారు. ప్రజావ్యతిరేక విధానాలపై మాట్లాడిన నాయకుడిని ప్రభుత్వం ఇబ్బంది పెడితే.. ఆ నాయకుడి తరుపున పోరాటం చేస్తామన్నారు. జగన్ పతనానికి ఉత్తరాంధ్ర నుంచే నాంది పలికామన్న బుద్ధా... ఉత్తరాంధ్రలోని 34 నియోజక వర్గాలను టీడీపీ కైవసం చేసుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు.