అదుపులోకి వస్తున్న కరోనా వ్యాప్తి.. అప్డేట్స్ ఇవిగో!
- గత 24 గంటల్లో 14,830 పాజిటివ్ కేసుల నమోదు
- దేశ వ్యాప్తంగా 36 మంది మృతి
- 1,47,512కి తగ్గిన యాక్టివ్ కేసుల సంఖ్య
ఇక, ఇప్పటి వరకు 4,32,46,829 మంది కరోనా నుంచి కోలుకున్నారు. మొత్తం 5,26,110 మంది కరోనాకు బలయ్యారు. ప్రస్తుతం దేశంలో పాజిటివిటీ రేటు 3.48 శాతంగా, క్రియాశీల రేటు 0.34 శాతంగా, రికవరీ రేటు 98.47 శాతంగా, మరణాల రేటు 1.20 శాతంగా ఉన్నాయి. ఇప్పటి వరకు 2,02,50,57,717 డోసుల కరోనా వ్యాక్సిన్ పంపిణీ చేయగా... నిన్న ఒక్క రోజే 30,42,476 మంది వ్యాక్సిన్ వేయించుకున్నారు.