రాజ్య‌స‌భ స‌భ్యుడిగా ఇళ‌య‌రాజా ప్ర‌మాణం.. వీడియో ఇదిగో

Ilaiyaraaja takes oath as rajyasabha member
  • రాష్ట్రప‌తి కోటాలో రాజ్య‌స‌భ‌కు ఎంపికైన ఇళ‌య‌రాజా
  • ఇళ‌య‌రాజాతో ప్ర‌మాణం చేయించిన డిప్యూటీ చైర్మన్
  • ఇప్ప‌టికే ప్ర‌మాణం చేసిన విజ‌యేంద్ర ప్ర‌సాద్‌, పీటీ ఉష‌
ప్ర‌ముఖ‌ సినీ సంగీత ద‌ర్శ‌కుడు ఇళ‌యరాజా సోమ‌వారం స‌రికొత్త ప్ర‌స్థానాన్ని ప్రారంభించారు. రాజ్య‌స‌భ స‌భ్యుడిగా ఆయ‌న ప‌ద‌వీ ప్ర‌మాణం చేశారు. పార్ల‌మెంటు వ‌ర్షాకా‌ల స‌మావేశాల్లో భాగంగా సోమ‌వారం రాజ్య‌స‌భలో డిప్యూటీ చైర్మన్ హ‌రివంశ్ నారాయ‌ణ్ సింగ్‌ ఆయ‌న చేత రాజ్య‌స‌భ స‌భ్యుడిగా ప్ర‌మాణ స్వీకారం చేయించారు. రాష్ట్రప‌తి కోటాలో రాజ్య‌స‌భ స‌భ్యుడిగా ఇటీవ‌లే ఇళ‌య‌రాజా ఎన్నికైన సంగ‌తి తెలిసిందే.

ఇళ‌య‌రాజాతో పాటు తెలుగు సినీ క‌థా ర‌చ‌యిత విజ‌యేంద్ర ప్ర‌సాద్‌, కర్ణాట‌క‌కు చెందిన సామాజిక‌వేత్త వీరేంద్ర హెగ్గడే, కేర‌ళ‌కు చెందిన ప‌రుగుల రాణి పీటీ ఉష‌ల‌ను ఇటీవ‌లే కేంద్రం రాష్ట్రప‌తి కోటాలో రాజ్య‌స‌భ స‌భ్యులుగా ఎంపిక చేసిన సంగ‌తి తెలిసిందే. వీరిలో ఇప్ప‌టికే విజ‌యేంద్ర ప్ర‌సాద్‌, పీటీ ఉష‌లు ప్ర‌మాణం చేయ‌గా.. సోమ‌వారం ఇళ‌య‌రాజా ప్ర‌మాణం చేశారు.
Go Back to Shorts
Rajya Sabha
BJP
Ilaiyaraaja
Tamilnadu
Music Director

More Telugu News