పుంగనూరు ఆవుకు కళ్లు చెదిరే ధర.. రూ. 4.10 లక్షలకు కొనుగోలు చేసిన బాబా రాందేవ్

చిత్తూరు జిల్లాలో ఎక్కువగా కనిపించే పుంగనూరు జాతి ఆవుకు కళ్లు చెదిరే ధర పలికింది. గుంటూరు జిల్లా తెనాలికి చెందిన ఓ పశుపోషకుడి దగ్గరనున్న ఆవు ఏకంగా రూ. 4.10 లక్షలకు అమ్ముడుపోయింది. ప్రముఖ యోగా గురు బాబా రాందేవ్ ఈ గోవును కొనుగోలు చేశారు. మూడున్నర సంవత్సరాల వయసున్న ఈ ఆవు ఎత్తు 30 అంగుళాలు మాత్రమే.

హరిద్వార్‌లోని బాబా రాందేవ్ ఆశ్రమం నుంచి తెనాలి వచ్చిన ప్రతినిధులు పశుపోషకుడు కంచర్ల శివకుమార్‌ను కలిసి ఆవును కొనుగోలు చేశారు. అంతకుముందు దానికి పశువైద్యాధికారి నాగిరెడ్డి వద్ద పరీక్షలు చేయించారు. అనంతరం దానిని వారు తీసుకెళ్లారు.  ప్రత్యేకమైన  ఈ జాతి పెంపకానికి అనువుగా ఉంటుందని బాబా రాందేవ్ ఆశ్రమ ప్రతినిధులు తెలిపారు.

Baba Ramdev
Punganur Cow
Guntur District
Tenali

More Telugu News