నాకు అంతా కుటుంబమేనన్న రిషి సునక్.. ప్రచారం ముమ్మరం!
- ప్రచార కార్యక్రమాల్లో భార్యా పిల్లలను వెంట పెట్టుకుని పాల్గొన్న రిషి
- కుటుంబానికి విలువ ఇవ్వడాన్ని నమ్ముతానని వెల్లడి
- కష్టపడి పనిచేయడం, కలిసి ఉండటాన్ని నమ్ముతానని వ్యాఖ్య
‘‘నాకు నా కుటుంబమే అంతా. గ్రాంథమ్ లో జరిగిన కార్యక్రమంలో నా వెంట నిలిచిన నా కుటుంబానికి కృతజ్ఞుడిగా ఉంటాను. సమగ్రత, కలిసి ఉండటం, కష్టించి పనిచేయడం, కుటుంబానికి విలువ ఇవ్వడాన్ని నేను నమ్ముతాను..” అని రిషి సునక్ ప్రకటించారు.బ్రిటన్ తాజా మాజీ ప్రధాన మంత్రి బోరిస్ జాన్సన్ మంత్రివర్గంలో రిషి సునక్ ఆర్థిక మంత్రి (చాన్సెలర్ ఆఫ్ ఎక్స్‌చెకర్)గా పనిచేశారు. అనూహ్య పరిణామాల మధ్య బోరిస్ జాన్సన్ రాజీనామా చేయడంతో.. కన్జర్వేటివ్ పార్టీ తరఫున కొత్త నాయకుడిని ఎన్నుకునే కసరత్తు మొదలుపెట్టారు. ఈ క్రమంలో రిషి సునక్ రేసులో నిలబడ్డారు. ఈ ఎన్నికల్లో ఆయన గెలిస్తే.. బ్రిటన్ కు తొలి భారత సంతతికి చెందిన ప్రధానిగా చరిత్ర సృష్టించనున్నారు.