వరద బాధితుల పరామర్శకు టీడీపీ జెండాలతో వెళతారా? సిగ్గుచేటు కాదా?: చంద్రబాబుపై అంబటి విమర్శలు
- కోనసీమ జిల్లాలో చంద్రబాబు పర్యటన
- వరద బాధితులకు పరామర్శ
- చంద్రబాబు రాజకీయాలు చేస్తున్నారన్న మంత్రి
ఈ ఏడాది వరదలు ఎంతో ముందుగా వచ్చాయని తెలిపారు. జగన్ పాలనలో వర్షాలు సమృద్ధిగా కురుస్తున్నాయని, చంద్రబాబు పాలనలో వర్షాలే లేవని అన్నారు. అసలు, చంద్రబాబు పాలనలో ప్రాజెక్టుల గేట్లు ఎత్తడమే జరగలేదని వెల్లడించారు. చంద్రబాబు అహంభావం వల్లే పోలవరం నిర్మాణం ఆలస్యమైందని, ఎవరైనా కాఫర్ డ్యామ్ కట్టకుండా డయాఫ్రం వాల్ నిర్మిస్తారా? అని అంబటి రాంబాబు నిలదీశారు. డయాఫ్రం వాల్ కొట్టుకుపోవడం టీడీపీ తప్పిదమేనని స్పష్టం చేశారు.