హత్రాస్‌లో కన్వర్ యాత్రికులపై నుంచి దూసుకెళ్లిన ట్రక్.. ఆరుగురి దుర్మరణం
- తెల్లవారుజామున 2.15 గంటల ప్రాంతంలో ఘటన
- హరిద్వార్ నుంచి గ్వాలియర్‌కు వెళ్తున్న యాత్రికులు
- మరొకరి పరిస్థితి విషమం
మృతదేహాలను పోస్టుమార్టానికి తరలించిన పోలీసులు తీవ్రంగా గాయపడిన బాధితుడిని ఆగ్రా మెడికల్ కాలేజీలో చేర్చారు. కన్వర్ యాత్రికులు హరిద్వార్ నుంచి గ్వాలియర్‌కు వస్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఘటనకు కారణమైన ట్రక్కు డ్రైవర్‌ను గుర్తించామని, త్వరలోనే అతడిని అదుపులోకి తీసుకుంటామని పోలీసులు తెలిపారు.