Raviteja: అబద్ధపు ప్రచారాలను నమ్మొద్దు: రవితేజ

  • రెమ్యునరేషన్ విషయంలో రవితేజ నిర్మాతలను వేధిస్తాడంటూ వార్తలు
  • నిర్మాతలు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు వారి చెక్కులను కూడా చించేశానన్న రవితేజ
  • వెబ్ మీడియాలో వచ్చే తప్పుడు వార్తలను నమ్మొద్దని విన్నపం
Raviteja requests fans not to believe false news

పారితోషికం విషయంలో రవితేజ చాలా కచ్చితంగా ఉంటాడని, నిర్మాతలను వేధిస్తాడంటూ ప్రచారం జరుగుతోంది. ఆయన తాజా చిత్రం 'రామారావు ఆన్ డ్యూటీ' విషయంలో కూడా ఇదే జరిగిందని... ఈ చిత్రంలో కొన్ని సీన్లను రీషూట్ చేశారని, వాటికి కూడా ఆయన అదనంగా డబ్బులు డిమాండ్ చేస్తున్నాడని ప్రచారం జరుగుతోంది. దీనిపై రవితేజ స్పందిస్తూ... ఆ వార్తల్లో ఎలాంటి నిజం లేదని అన్నారు. 

'రామారావు ఆన్ డ్యూటీకి' తాను కోప్రొడ్యూసర్ ని అని... అలాంటప్పుడు రెమ్యునరేషన్ సమస్య ఎక్కడి నుంచి వస్తుందని రవితేజ ప్రశ్నించారు. నిర్మాతలు ఇబ్బందుల్లో ఉన్నారని తెలిసినప్పుడు... వారిచ్చిన చెక్ లను తాను చించేసిన సందర్భాలు కూడా ఉన్నాయని చెప్పారు. వెబ్ మీడియాలో వస్తున్న తప్పుడు వార్తలను నమ్మొద్దని విన్నవించారు. మరోవైపు 'రామారావు ఆన్ డ్యూటీ' చిత్రం ఈ నెల 29న విడుదల కాబోతోంది. ఈ చిత్రంలో దివ్యాంశ కౌశిక్, రాజీషా విజయన్, వేణు తొట్టెంపూడి, నాజర్, నరేశ్, పవిత్ర లోకేశ్ తదితరులు నటించారు.

More Telugu News