తెలంగాణలో తాజాగా 540 కరోనా పాజిటివ్ కేసులు

తెలంగాణలో గడచిన 24 గంటల్లో 25,585 శాంపిల్స్ పరీక్షించగా, 540 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. మరో 603 మంది ఫలితాలు వెల్లడి కావాల్సి ఉంది. అత్యధికంగా హైదరాబాదులో 272 కొత్త కేసులు నమోదయ్యాయి. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో 26, రంగారెడ్డి జిల్లాలో 21, ఖమ్మం జిల్లాలో 15, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 14 కేసులు వెల్లడయ్యాయి. 

అదే సమయంలో 708 మంది కరోనా నుంచి పూర్తిగా కోలుకున్నారు. రాష్ట్రంలో తాజాగా మరణాలేవీ సంభవించలేదు. 

తెలంగాణలో ఇప్పటిదాకా 8,10,318 మంది కరోనా బారినపడగా, వారిలో 8,01,726 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 4,481 మంది చికిత్స పొందుతున్నారు. కరోనాతో ఇప్పటిదాకా 4,111 మంది మరణించారు.

Telangana
Corona Virus
Daily Report
New Cases

More Telugu News