ఇండియాలో స్వల్పంగా తగ్గిన కరోనా కేసులు.. అప్డేట్స్ ఇవిగో!
- గత 24 గంటల్లో 16,935 కేసుల నమోదు
- కరోనా నుంచి కోలుకున్న వారు 16,069 మంది
- దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య 1,44,264
ప్రస్తుతం దేశంలో పాజిటివిటీ రేటు 6.48 శాతంగా, రికవరీ రేటు 98.47 శాతంగా, క్రియాశీల రేటు 0.33 శాతంగా, మరణాల రేటు 1.20 శాతంగా ఉన్నాయి. ఇప్పటి వరకు 2,00,04,61,095 డోసుల కరోనా వ్యాక్సిన్ వేయగా... నిన్న ఒక్కరోజే 4,46,671 మంది వ్యాక్సిన్ వేయించుకున్నారు. మరోవైపు టెస్టింగ్ లు తక్కువ కావడం వల్లే కొత్త కేసుల్లో తగ్గుదల కనిపించిందని అంటున్నారు.