భద్రాచలం ముంపు బాధితులకు శాశ్వత ప్రాతిపదికన కాలనీలు: సీఎం కేసీఆర్ హామీ
- వరద చేరని ఎత్తైన ప్రాంతాలను గుర్తించి నిర్మాణం చేపట్టాలని కలెక్టర్ కు ఆదేశం
- గోదావరి వరద ప్రాంతాలను పరిశీలించిన ముఖ్యమంత్రి
- పునరావాస కేంద్రాల్లో ప్రజలను పరామర్శించిన కేసీఆర్
అక్కడ ముంపు బాధితులను సీఎం కేసీఆర్ పరామర్శించారు. వారి ఆరోగ్య పరిస్థితులు, యోగ క్షేమాలు అడిగి తెలుసుకున్నారు. బాధితులకు అందుతున్న నిత్యావసర వస్తువులు, సౌకర్యాలు, వైద్యం, ఇతర సహాయం గురించి సీఎం ఆరా తీశారు. వారిని పేరుపేరునా పలకరించారు. తమకు అన్నిరకాలుగా సహాయ, సహకారాలు అందుతున్నాయని, స్థానిక మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, ప్రభుత్వ అధికారులు తమను కంటికి రెప్పలా కాపాడుతున్నారని సీఎంకు బాధితులు వివరించారు. తమకు శాశ్వత ప్రాతిపదికన ఇళ్లు నిర్మిస్తామని సీఎం హామీ ఇవ్వడంతో పునరావాస కేంద్రాల్లోని బాధితులు హర్షం వ్యక్తం చేశారు.