అత్యున్నత ప్రమాణాలతో బుందేల్‌ఖండ్ ఎక్స్‌ప్రెస్ వే!... యూపీలో ప్రారంభించిన మోదీ!
- 296 కిలో మీటర్ల మేర బుందేల్‌ఖండ్ ఎక్స్‌ప్రెస్ వే
- రూ.14,850 కోట్లతో నిర్మించిన కేంద్ర ప్రభుత్వం
- 6 లేన్లతో 7 జిల్లాల మీదుగా సాగనున్న రహదారి
ఈ కొత్త రహదారికి చెందిన ఫొటోలు, వీడియోలు గడచిన రెండు, మూడు రోజులుగా చక్కర్లు కొడుతున్నాయి. అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో నిర్మితమైన ఈ రహదారితో బుందేల్‌ఖండ్ రూపు రేఖలే మారిపోతాయని మోదీ సర్కారు చెబుతోంది. ఈ రహదారితో బుందేల్‌ఖండ్ పారిశ్రామికంగానే కాకుండా ఆయా ప్రాంతాలతో మరింత మెరుగైన వ్యాపార బంధాలు నెలకొనే అవకాశాలున్నాయని కేంద్రం చెబుతోంది. ఈ రహదారిని మోదీ ప్రారంభించిన వీడియోను కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.