సెమీస్ చేరిన సింధు.. క్వార్ట‌ర్స్‌లోనే ఓడిన సైనా

pv sindhu enters into semi finals of singapore open
  • చైనా క్రీడాకారిణిని మ‌ట్టి క‌రిపించిన సింధు
  • టైటిల్‌కు రెండు అడుగుల దూరంలో నిలిచిన తెలుగు తేజం
  • జ‌పాన్ క్రీడాకారి‌ణి చేతిలో ఓడిన సైనా నెహ్వాల్‌
  • పురుషుల సింగిల్స్‌లో ప్ర‌ణ‌య్ కూడా ఓట‌మిపాలు
సింగ‌పూర్ ఓపెన్‌లో శుక్ర‌వారం భార‌త్‌కు మిశ్ర‌మ ఫ‌లితాలు ద‌క్కాయి. మ‌హిళ‌ల సింగిల్స్‌లో ఇప్ప‌టికే క్వార్ట‌ర్ ఫైన‌ల్ చేరిన తెలుగు తేజం పీవీ సింధు తాజాగా సెమీ ఫైన‌ల్ చేరింది. శుక్ర‌వారం జ‌రిగిన క్వార్ట‌ర్ ఫైన‌ల్ మ్యాచ్‌లో చైనాకు చెందిన హాన్ యూను 17-21, 21-11, 21-19 స్కోరుతో మ‌ట్టి క‌రిపించింది. వెర‌సి సింధు సెమీ ఫైన‌ల్‌లో అడుగు పెట్టి టైటిల్ వేట‌కు రెండు అడుగుల దూరంలో నిలిచింది.

ఇక ఈ సిరీస్‌లో మ‌హిళ‌ల సింగిల్స్‌లో ఆదిలో స‌త్తా చాటిన మ‌రో తెలుగు తేజం సైనా నెహ్వాల్ క్వార్ట‌ర్స్‌లోనే ఓట‌మిపాలైంది. శుక్ర‌వారం జ‌రిగిన క్వార్ట‌ర్ ఫైన‌ల్‌లో జ‌పాన్‌కు చెందిన అయా ఒహోరి చేతిలో 13-21, 21-15, 20-22 స్కోరు తేడాతో ఓట‌మిపాలైంది. వెర‌సి క్వార్టర్స్‌లోనే సైనా ఇంటి బాట ప‌ట్టాల్సి వ‌చ్చింది. ఇక పురుషుల సింగిల్స్‌లో ప్ర‌ణ‌య్ కూడా ఇంటి బాట ప‌ట్టాడు. శుక్ర‌వారం జ‌రిగిన క్వార్ట‌ర్ ఫైన‌ల్ మ్యాచ్‌లో జ‌పాన్‌కు చెందిన కొడ‌య్ న‌ర‌వోకా చేతిలో 21-12, 14-21, 18-21 స్కోరుతో ఓట‌మిపాల‌య్యాడు.
Go Back to Shorts
PV Sindhu
Saina Nehwal
H. S. Prannoy
Singapore Open

More Telugu News