పెళ్లి కాలేదు, ఎంగేజ్‌మెంటూ కాలేదు!...లలిత్ మోదీ ట్వీట్లపై సుస్మితా సేన్ క్లారిటీ!
- సుస్మితతో డేటింగ్‌లో ఉన్నానని లలిత్ మోదీ ట్వీట్
- ఏదో ఒకరోజు పెళ్లి జరిగితీరుతుందన్న లలిత్
- డేటింగ్‌పై మాత్రం నోరు విప్పని బాలీవుడ్ నటి
- ప్రస్తుతం సంతోషంగా ఉన్నానని చెప్పిన సుస్మిత
లలిత్ మోదీ పేరును ప్రస్తావించకుండా అసలు విషయాన్ని సూటిగా చెప్పేసిన సుస్మిత... తనకు ఇంకా పెళ్లి కాలేదని, కనీసం ఎంగేజ్ మెంట్ కూడా కాలేదని వెల్లడించింది. తాను ప్రస్తుతం సంతోషంగా ఉన్నానని కూడా ఆమె తెలిపింది. ఈ వ్యవహారంపై తాను పూర్తి స్థాయిలో స్పష్టత ఇచ్చినట్టుగానే భావిస్తున్నానని ఆమె పేర్కొంది. అయితే లలిత్ మోదీ కూడా తాను ఇప్పటిదాకా పెళ్లి చేసుకోలేదని తెలిపిన సంగతి తెలిసిందే. తామిద్దరం డేటింగ్‌లో ఉన్నామని ఆయన తెలిపారు. అయితే పెళ్లి, ఎంగేజ్‌మెంట్లపై క్లారిటీ ఇచ్చిన సుస్మిత డేటింగ్‌పై మాత్రం నోరు విప్పకపోవడం గమనార్హం.